న‌టుడు అనుప‌మ్‌ఖేర్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌... ఆసుప‌త్రిలో చేరిక‌!

ABN , First Publish Date - 2020-07-12T17:02:55+05:30 IST

బాలీవుడ్ న‌టులు అమితాబ్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన‌ప‌డి చికిత్స తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ న‌టుడు అనుపమ్ ఖేర్ తల్లి, సోదరునితో సహా నలుగురు కుటుంబ సభ్యులు కూడా...

న‌టుడు అనుప‌మ్‌ఖేర్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌... ఆసుప‌త్రిలో చేరిక‌!

బాలీవుడ్ న‌టులు అమితాబ్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన‌ప‌డి చికిత్స తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ న‌టుడు అనుపమ్ ఖేర్ తల్లి, సోదరునితో సహా నలుగురు కుటుంబ సభ్యులు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అనుపమ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్వ‌యంగా తెలియ‌జేశారు. గ‌త కొద్ది రోజులుగా  తన తల్లి దులారి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని అనుపమ్ తెలిపారు. కొంత‌కాలంగా ఆమెకు ఆకలి క‌ల‌గ‌డం లేద‌ని, నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని పేర్కొన్నారు. వైద్యుని స‌ల‌హాతో ప‌రీక్ష‌లు చేయించ‌గా, ఆమె క‌రోనా పాజిటివ్ అని తేలింద‌న్నారు. త‌రువాత త‌న కుటుంబ స‌భ్య‌ల‌కు క‌రోనా పరీక్ష‌లు చేయించ‌గా, న‌లుగురు పాజిటివ్‌గా తేలార‌న్నారు. త‌న త‌ల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని బీఎంసీకి నివేదించ‌డంతో త‌మ బిల్డింగ్‌ను శానిటైజ్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-12T17:02:55+05:30 IST