వ్యాక్సిన్ కోసం రోదించిన ప్ర‌ముఖ న‌టుడు

ABN , First Publish Date - 2020-07-29T18:37:27+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ఈ నేప‌ధ్యంలో న‌టుడుఅనుపమ్ ఖేర్ ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో...

వ్యాక్సిన్ కోసం రోదించిన ప్ర‌ముఖ న‌టుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అంత‌కంత‌కు విజృంభిస్తోంది. ఈ నేప‌ధ్యంలో న‌టుడుఅనుపమ్ ఖేర్ ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కరోనా వ్యాక్సిన్ ఇంకారానందుకు అనుప‌మ్ ఖేర్ ఏడుస్తూ క‌నిపిస్తున్నాడు... వ్యాక్సిన్ లేకుండా అంతా శూన్యం. వ్యాక్సిన్ లేకుండానే ఏప్రిల్‌, మే, జూన్ నెల‌లు గ‌డిచిపోయాయి. ఇప్ప‌టికైనా వ్యాక్సిన్ క‌నుగొనండి... అని రోదిస్తూ అభ్య‌ర్థిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా అనుప‌మ్ తల్లి క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇదిలావుండ‌గా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 14 లక్షల 83 వేలకు చేరుకుంది. ఈ నేప‌ధ్యంలో కరోనా వ్యాక్సిన్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. 

Updated Date - 2020-07-29T18:37:27+05:30 IST