గ్లామర్‌పై అను ఇమ్మానుయేల్ ఫోక‌స్‌

ABN , First Publish Date - 2020-06-16T15:01:54+05:30 IST

కోలీవుడ్‌లో విశాల్‌, శివకార్తికేయన్‌ సరసన హీరోయిన్‌గా నటించిన అందాల భామ అను ఇమ్మానుయేల్‌ సినిమా చాన్సుల కోసం గ్లామర్‌పై దృష్టి సారిస్తోంది.

గ్లామర్‌పై అను ఇమ్మానుయేల్ ఫోక‌స్‌

కోలీవుడ్‌లో విశాల్‌, శివకార్తికేయన్‌ సరసన హీరోయిన్‌గా నటించిన అందాల భామ అను ఇమ్మానుయేల్‌ సినిమా చాన్సుల కోసం గ్లామర్‌పై దృష్టి సారిస్తోంది. సినీ హీరోయిన్లు సినిమా చాన్సుల కోసం సామాజిక ప్రసార మాధ్యమాల్లో శృంగారభరితమైన ఫొటోలను పోస్టు చేయడం ఆనవాయితీగా మారింది. ఆ కోవలోనే తమిళంలో తుప్పరివాలన్‌ చిత్రంలో విశాల్‌తో, నమ్మవీట్టుపిళ్లై చిత్రంలో యువనటుడు శివ కార్తికేయన్‌తో నటించిన అను ఇమ్మానుయేల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న ఫొటోలను పోస్టు చేసింది. వాటిని చూసిన అభిమానులు ఆమెను పొగడుతూ కామెంట్లు విసురుతున్నారు. ఇప్పటిదాకా నిండుగా దుస్తులు ధరించి ఫొటోలు పెట్టిన అను ఇమ్మానుయేల్‌ ఉన్నట్టుండి శృంగారభరితమైన భంగిమలతో ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేయడం కలకలం సృష్టించింది.

Updated Date - 2020-06-16T15:01:54+05:30 IST