మహిళకు మరో మహిళ అండగా నిలవాలి!

ABN , First Publish Date - 2020-05-14T11:19:36+05:30 IST

‘‘గృహహింస కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలు మాట్లాడాల్సిన తరుణమిది. ఓ మహిళకు మరో మహిళ అండగా నిలవాలి. గృహహింసకు గురయ్యామని వచ్చిన మహిళలపై వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి అనుచితంగా...

మహిళకు మరో మహిళ అండగా నిలవాలి!

‘‘గృహహింస కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలు మాట్లాడాల్సిన తరుణమిది. ఓ మహిళకు మరో మహిళ అండగా నిలవాలి. గృహహింసకు గురయ్యామని వచ్చిన మహిళలపై వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి అనుచితంగా మాట్లాడడం సరికాదు’’ అని నటి ఊర్మిళ అన్నారు. లాక్‌డౌన్‌ కావడంతో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో గల సొంత వ్యవసాయ క్షేత్రంలో మీర్‌ మోసిన్‌ అక్తర్‌, ఊర్మిళ దంపతులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, పుస్తకాలు చదువుతూ, యోగా చేస్తూ గడుపుతున్నారు. రైతులు, వలస కార్మికులు, రోజువారీ కూలీల పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఆమె అన్నారు.


ఇంకా మహిళల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో నేనిప్పటి వరకూ ఎవరి గురించి అనుచితంగా మాట్లాడలేదు. లూజ్‌ టాక్స్‌ లేనే లేవు. మరో మహిళ మనసు గాయపరిచేలా, ఆమె కృషిని తక్కువ చేసేలా నేనిప్పటివరకూ మాట్లాడలేదు. మహిళలకు మహిళలే అండగా నిలబడాలి’’ అన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ ‘రంగీలా’తో ఊర్మిళ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు తెలుగులో ‘అంతం’, ‘గాయం’, ఆ తర్వాత ‘అనగనగా ఒక రోజు’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు వెబ్‌ ప్రపంచంలోకి అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ‘‘మార్చిలో వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ మొదలు కావాలి. అయితే... లాక్‌డౌన్‌ వల్ల ఆగింది. మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి’’ అని ఊర్మిళ తెలిపారు.

Updated Date - 2020-05-14T11:19:36+05:30 IST