ఈ సారైనా అన్నను మెప్పించాలి!

ABN , First Publish Date - 2020-12-25T05:40:27+05:30 IST

దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ భాషలకతీతంగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన తమిళ కథానాయకుడు ధనుష్‌....

ఈ సారైనా అన్నను మెప్పించాలి!

దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ భాషలకతీతంగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన తమిళ కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడాయన ‘‘కనీసం ఈ సారైనా నా నటనతో మా అన్నను మెప్పించాలి’’ అంటున్నారు. అలా ఎందుకంటున్నారంటే కలైపులి థాను నిర్మాతగా సోదరుడు సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా కొత్త చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా యువన్‌ శంకర్‌రాజాను, ఛాయాగ్రాహకుడిగా అరవింద్‌ కృష్ణను తీసుకున్నట్టు సెల్వరాఘవన్‌ ప్రకటించారు. దానికి స్పందిస్తూ ధనుష్‌ ట్విట్టర్లో ‘‘సెల్వ రాఘవన్‌, యువన్‌, అరవింద్‌ కృష్ణ... కాంబినేషన్‌ బాగుంది. నా తొలి చిత్రం నాటి కాంబినేషన్‌ మళ్లీ కలిసింది. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా అన్నే కారణం. నా క్రియేటర్‌, మేకర్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. కనీసం ఈ సారైనా మా అన్నను మెప్పించాలి’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-12-25T05:40:27+05:30 IST