తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్..?
ABN , First Publish Date - 2020-04-16T00:54:05+05:30 IST
వైజాగ్‌కు చెందిన అనీషా అంబ్రోస్ ‘అలియాస్ జానకి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది.

వైజాగ్‌కు చెందిన అనీషా అంబ్రోస్ ‘అలియాస్ జానకి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగులో గోపాల గోపాల, రన్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ఒక్కడు మిగిలాడు, ఈ నగరానికి ఏమైంది, సెవన్ చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటించింది అనీషా. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమా రంగానికి పూర్తిగా దూరమైంది. త్వరలోనే అనీషా అంబ్రోస్ తల్లికానుంది. అనీషా అంబ్రోస్, ఆమె భర్త ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.