నాడు అజిత్‌ కుమార్తెగా మెప్పించి నేడు హీరోయిన్‌గా..

ABN , First Publish Date - 2020-08-02T15:09:32+05:30 IST

అజిత్‌, నయనతార నటించిన ‘విశ్వాసం’ చిత్రంలో బాలనటిగా తమిళ చిత్రసీమకు పరిచయమైంది అనికా. ఆ చిత్రంలో అజిత్‌ కుమార్తెగా చక్కగా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నాడు అజిత్‌ కుమార్తెగా మెప్పించి నేడు హీరోయిన్‌గా..

అజిత్‌, నయనతార నటించిన ‘విశ్వాసం’ చిత్రంలో బాలనటిగా తమిళ చిత్రసీమకు  పరిచయమైంది అనికా. ఆ చిత్రంలో అజిత్‌ కుమార్తెగా చక్కగా నటించి తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం చీరకట్టుతో ఫోటో సెషన్‌లో పాల్గొని సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను విడుదల చేయడంతో సంచలనం అయ్యింది.  చీరకట్టులో అనికాను చూసి నెటిజన్లు మురిసిపోయారు. శ్రీదేవి, మీనా, హన్సిక తర్వాత బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అనికా త్వరలో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. ఆ చిత్రం వివరాలు లాక్‌డౌన్‌  తర్వాత ప్రకటిస్తానని అనికా చెబుతోంది. ప్రస్తుతం చీరకట్టులో వివిధ భంగిమలలో తీసిన అనికా ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - 2020-08-02T15:09:32+05:30 IST