రాద్ధాంతం చేయకూడదనే అప్పుడు చెప్పలేదు: అనసూయ

ABN , First Publish Date - 2020-08-14T21:37:46+05:30 IST

ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై అలరిస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.

రాద్ధాంతం చేయకూడదనే అప్పుడు చెప్పలేదు: అనసూయ

ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై అలరిస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ. పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందించే అనసూయ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడింది.


`నేను కూడా గతంలో ఫేవరెటిజం కారణంగా చాలా అవకాశాలు కోల్పోయాను. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఉద్దేశంతోనే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. రెండేళ్ల క్రితం గ్రూప్ ఫేవరెటిజం వల్ల నేను అవకాశాలు కోల్పోయాను. అయినా నా టాలెంట్‌నే నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. కష్టాన్ని నమ్ముకుంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేర`ని అనసూయ పేర్కొంది. 


Updated Date - 2020-08-14T21:37:46+05:30 IST