మెంటల్.. నిన్ను అంతలా ప్రేమిస్తున్నా: అనసూయ

ABN , First Publish Date - 2020-06-05T17:05:10+05:30 IST

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మెంటల్.. నిన్ను అంతలా ప్రేమిస్తున్నా: అనసూయ

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ కెరీర్ పరుగులు పెడుతూనే ఉంది. 2010లో శశాంక్ భరద్వాజ్‌ను అనసూయ వివాహం చేసుకుంది. తమ పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


`నా బలం.. నా గందరగోళం.. నా మానసిక స్థైర్యం.. నీ ప్రోత్సాహం లేకుండా నేనేం చేయగలనో నాకే తెలీదు. ప్రతిసారి మనం పోట్లాడుకుంటాం. ఇక ఎప్పటికీ నీతో మాట్లాడకూడదనుకుంటా. నేనొక పెద్ద ఫూల్‌ని..! నీతో కలిసి బతకడం మాత్రమే నాకు తెలుసు. అంతకు మించి ఇంకేం తెలీదు. అధికారికంగా ఇది మన పదో పెళ్లి రోజు. కానీ, మన బంధం శాశ్వతమని మనద్దరికీ తెలుసు. ఇన్ఫినిటీ స్టోన్స్‌ను థానోస్ ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. మెంటల్!` అంటూ అనసూయ పోస్ట్ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.  
Updated Date - 2020-06-05T17:05:10+05:30 IST