విజయ్‌తో అనన్యా పాండే

ABN , First Publish Date - 2020-02-21T06:58:15+05:30 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే! ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘పతీ పత్ని ఔర్‌ ఓ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న...

విజయ్‌తో అనన్యా పాండే

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే! ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘పతీ పత్ని ఔర్‌ ఓ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్యా పాండే విజయ్‌ సరసన జోడీగా ఎంపికయ్యారు. గురువారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. పూరి జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌జోహర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. 


Updated Date - 2020-02-21T06:58:15+05:30 IST