నెట్టింట వైరల్ అవుతోన్న అనన్య పింక్‌ యోగా సెషన్‌

ABN , First Publish Date - 2020-10-09T15:28:28+05:30 IST

తన యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోలను అనన్యపాండే తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో ఎలాంటి సపోర్ట్‌ లేకుండా చేసిన శీర్షాసనం ఫొటో నెట్టింట వైరల్‌ అవుతుంది.

నెట్టింట వైరల్ అవుతోన్న అనన్య పింక్‌ యోగా సెషన్‌

బాలీవుడ్‌ బ్యూటీ అనన్యపాండే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన 'కాలీ పీలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తదుపరి విజయ్‌ దేవరకొండతో కలసి 'ఫైటర్‌' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్‌ అయ్యేందుకు సమయం పట్టేలా ఉంది. దీంతో ఈ గ్యాప్‌లో అనన్య ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టారు. తన యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోలను అనన్యపాండే తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో ఎలాంటి సపోర్ట్‌ లేకుండా చేసిన శీర్షాసనం ఫొటో నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే యోగా సెషల్‌లో ఆమె పింక్‌ డ్రెస్‌ వేసుకోవడంతో పాటు యోగా చేయడానికి ఉపయోగించిన మ్యాట్‌ కూడా పింక్‌ కలర్‌లో ఉండటంతో అభిమానులు అసలు అనన్య పింక్‌ మూడ్‌లో ఉందేమిటి? అని అనుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ సుహానాను కలవని అనన్య, సోదరి రిసాతో కలిసి కుకీస్‌ను చేసి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. 


Updated Date - 2020-10-09T15:28:28+05:30 IST