గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ అనన్య నాగళ్ళ

ABN , First Publish Date - 2020-08-02T02:56:11+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ అనన్య నాగళ్ళ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి శనివారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు హీరోయిన్ అనన్య నాగళ్ళ. అనంతరం ఆమె కూడా మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్‌కు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ మాట్లాడుతూ.. ‘‘మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పాల్గొని మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరో ముగ్గురిని నేను కూడా నామినేట్ చేస్తున్నాను. అంజలి, నివేదా థామస్, ప్రియాంక జ్వలితలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు.  

Updated Date - 2020-08-02T02:56:11+05:30 IST