విజయ్‌పై విమర్శ.. తమ్ముడి కౌంటర్!

ABN , First Publish Date - 2020-10-12T21:18:47+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఓటు హక్కు గురించి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి

విజయ్‌పై విమర్శ.. తమ్ముడి కౌంటర్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఓటు హక్కు గురించి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ధనికులకు, పేదవాళ్లకు, లిక్కర్ తీసుకొని ఓటు వేసే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని ఇటీవల విజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వాన్ని సమర్థించే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 


తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ కూడా విజయ్‌కు సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చాడు. `తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకో హెయిర్ కట్ సూచిస్తాన`ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై విజయ్ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. `సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడారో అర్థం చేసుకోవాల`ని సూచించాడు. Updated Date - 2020-10-12T21:18:47+05:30 IST

Read more