కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా అమృతా అయ్య‌ర్..!

ABN , First Publish Date - 2020-05-11T18:27:18+05:30 IST

‘బిగిల్‌’ చిత్రంలోని మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా నటించిన యువతార అమృతా అయ్యర్‌ తన కొత్త చిత్రంలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కనిపించనుంది.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా అమృతా అయ్య‌ర్..!

‘బిగిల్‌’ చిత్రంలోని మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా నటించిన యువతార అమృతా అయ్యర్‌ తన కొత్త చిత్రంలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కనిపించనుంది. ‘పడైవీరన్‌’, ‘తెరి’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెప్పించిన అమృత ప్రస్తుతం ‘లిఫ్ట్‌’ అనే థ్రిల్లర్‌లో నటిస్తోంది. కొత్త దర్శకుడు వినీత్‌ వరప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పాత్రలో నటిస్తోంది. కాగా ఈమె తెలుగులో రామ్ ‘రెడ్’ చిత్రంలోనూ, ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా న‌టించిన ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’  చిత్రాల్లోనూ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2020-05-11T18:27:18+05:30 IST