థియేటర్లలో ‘అమ్మాయంటే అలుసా?’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , First Publish Date - 2020-12-15T22:47:51+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన అన్‌లాక్‌లో ఇటీవలే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు వచ్చాయి. అయినా కూడా ధైర్యంగా సినిమా రిలీజ్‌ చేయడానికి ఎవరూ

థియేటర్లలో ‘అమ్మాయంటే అలుసా?’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన అన్‌లాక్‌లో ఇటీవలే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు వచ్చాయి. అయినా కూడా ధైర్యంగా సినిమా రిలీజ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కారణం ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్లకు వస్తారా? అని దర్శకనిర్మాతలు ఆలోచనలో ఉండటమే. కొన్ని చోట్ల థియేటర్లు ఓపెన్‌ చేశారు. 50 శాతం సీటింగ్‌తో పాత సినిమాలనే అంటే కరోనాకి ముందు రిలీజ్‌ అయిన సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి పరవాలేదు అనేలా రెస్పాన్స్‌ వస్తుండటంతో.. ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరో హీరోయిన్లుగా నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. నేనే శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిందని తెలుపుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు నేనే శేఖర్ తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో నా పరిధిలో సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. నాకు నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. వారందరికీ ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో సెకండాఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాన్ని డిసెంబర్‌ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-12-15T22:47:51+05:30 IST

Read more