ప్రభాస్ సినిమాపై అమితాబ్ స్పందన!

ABN , First Publish Date - 2020-10-09T21:18:07+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ పాన్ ఇండియా

ప్రభాస్ సినిమాపై అమితాబ్ స్పందన!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తోంది. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. 


ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. `లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం` అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన అమితాబ్ ఈ సినిమా గురించి స్పందించారు. `ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా` అంటూ కామెంట్ చేశారు. అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల ప్రభాస్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. 
Updated Date - 2020-10-09T21:18:07+05:30 IST