అమితాబ్‌ ఫోన్‌ చేసి అభినందించారు

ABN , First Publish Date - 2020-04-16T09:57:26+05:30 IST

‘‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విధానం తెలుసుకుని, అమితాబ్‌ బచ్చన్‌గారు నాకు స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు’’...

అమితాబ్‌ ఫోన్‌ చేసి అభినందించారు

‘‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విధానం తెలుసుకుని, అమితాబ్‌ బచ్చన్‌గారు నాకు స్వయంగా ఫోన్‌ చేసి  అభినందించారు’’ అని చిరంజీవి అన్నారు. ఆయన అధ్యక్షతన, తెలుగు చలనచిత్ర కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన సీసీసీ, మంగళవారం ఒక్క రోజే వెయ్యి మందికి నిత్యావసర సరుకులను అందజేసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద పని చేయాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు రావాలి. ఇదొక బాధ్యతగా, ధర్మంగా బావించి పని చేయాలి. ఒకే రోజు వెయ్యిమందికి నిత్యావస సరుకులు పంపిణీ చేశామంటే పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. డబ్బులున్నా... పని చేసేవాళ్లు కావాలని అందరూ ప్రశంసిస్తున్నారు.  తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌. శంకర్‌, మరీ ముఖ్యంగా మెహర్‌ రమేశ్‌కి నా ప్రతేక అభినందనలు’’ అన్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు ‘‘ఇంట్లో ఉంటాం. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు, ప్రేమని పంచుతాం. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం’’ అని రాసి ఉన్న ప్లకార్డ్స్‌ పట్టుకుని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దీని కోసం ఎవరి ఇంటి దగ్గర వారు ఉండి ఫొటోషూట్‌ చేశారని తెలిసింది.

Updated Date - 2020-04-16T09:57:26+05:30 IST

Read more