బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌లో చేరిక

ABN , First Publish Date - 2020-07-12T04:58:08+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబైలోని..

బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌లో చేరిక

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయాన్ని బిగ్‌బీనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆసుపత్రికి వెళ్లామని.. కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు అమితాబ్ ట్వీట్ చేశారు.


గత 10 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. అమితాబ్ వయసు ప్రస్తుతం 77 సంవత్సరాలు. బాలీవుడ్‌లో సింగర్ కనికా కపూర్ తర్వాత మళ్లీ ప్రముఖులెవరూ కరోనా బారిన పడలేదు. అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.Updated Date - 2020-07-12T04:58:08+05:30 IST