కేబీసీ సీజన్-12 షురూ... మొదటి ప్రశ్నఇదే!

ABN , First Publish Date - 2020-09-29T12:04:27+05:30 IST

దేశంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభమయ్యింది. 2000లో ప్రారంభమైన ఈ క్విజ్ షోకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. కరోనా కాలంలో అనేక...

కేబీసీ సీజన్-12 షురూ... మొదటి ప్రశ్నఇదే!

దేశంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభమయ్యింది. 2000లో ప్రారంభమైన ఈ క్విజ్ షోకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. కరోనా కాలంలో అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఈ షోను ప్రారంభించారు. దిగ్గజ నటుడు అమితాబ్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో తొలి ప్రశ్న ప్రస్తుత దేశ పరిస్థితులను అనుసరించివుంది. అమితాబ్ బచ్చన్ పార్టిసిపేట్స్ అందరికీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో ఒక ప్రశ్న అడిగారు.2020లో సంభవించిన ఈ ఘటనలను మొదటి నుంచి వరుసక్రమంలో పెట్టండి.

ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు....

ఎ. నమస్తే ట్రంప్

బి. జనతా కర్ఫ్యూ

సి. ఆంఫన్ తుఫాను

డి. భారత్‌లో లాక్‌డౌన్

ఈ ప్రశ్నకు సరైన సమాధానం వరుస క్రమంలో ఆప్షన్- ఎ(నమస్తే ట్రంప్) ఆప్షన్ బి-(జనతా కర్ఫ్యూ), ఆప్షన్ డి-(భారత్‌లో లాక్ డౌన్) ఆప్షన్-సి(ఆంఫన్ తుఫాను). 

ఈ ప్రశ్నకు కంటెస్టెంట్ ఆరతి అత్యంత వేగంగా సమాధానం చెప్పారు. ఆమె ఆమితాబ్ ముందు కూర్చుని క్విజ్ షోను ప్రారంభించారు. 

Updated Date - 2020-09-29T12:04:27+05:30 IST