అమితాబ్ త‌రువాత అభిషేక్ పాజిటివ్‌... జ‌య‌, ఐశ్వ‌ర్య నెగిటివ్‌!

ABN , First Publish Date - 2020-07-12T09:55:26+05:30 IST

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్(77) కరోనా పాజిటివ్ అని తేలిన త‌రువాత, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డార‌ని వెల్ల‌డ‌య్యింది.

అమితాబ్ త‌రువాత అభిషేక్ పాజిటివ్‌... జ‌య‌, ఐశ్వ‌ర్య నెగిటివ్‌!

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్(77) కరోనా పాజిటివ్ అని తేలిన త‌రువాత, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డార‌ని వెల్ల‌డ‌య్యింది. అమితాబ్‌కు పాజిటివ్ రిపోర్టు వ‌చ్చిన నేప‌ధ్యంలో, అత‌ని కుమారుడు అభిషేక్ బచ్చన్(44)కు కరోనా టెస్టులు నిర్వ‌హించారు. అత‌ను కూడా పాజిటివ్ అని తేల‌డంతో ‌ముంబైలో అమితాబ్ చికిత్స‌పొందుతున్న‌ నానావతి ఆసుపత్రిలోనే అభిషేక్‌ను కూడా చేర్పించారు. కాగా అమితాబ్ భార్య జ‌యా బ‌చ్చ‌న్‌, అభిషేక్ భార్య ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఇద్ద‌రి రిపోర్టుల‌లో నెగిటివ్ అని వ‌చ్చింది. మిగిలిన కుటుంబ స‌భ్యుల క‌రోనా ప‌రీక్ష‌ల రిపోర్టు ఇంకా రావ‌ల‌సివుంది.  అమితాబ్ క‌రోనా బారిన ప‌డిన నేప‌ధ్యంలో బాలీవుడ్ తార‌లు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-12T09:55:26+05:30 IST