వైజయంతీ మూవీస్‌, ప్రభాస్‌ చిత్రంలో అమితాబ్‌

ABN , First Publish Date - 2020-10-09T16:14:43+05:30 IST

యూనివర్సల్‌ అప్పీల్‌తో రూపొందబోయే ఈ భారీ బడ్జెట్‌ మల్టీ లింగ్వువల్‌ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది.

వైజయంతీ మూవీస్‌, ప్రభాస్‌ చిత్రంలో అమితాబ్‌

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా  ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో  ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనె నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ స్టార్స్ కాంబినేషన్‌లో మూవీ లవర్స్‌ కోసం ఎపిక్‌ మూవీని రూపొందించనున్నారు. యూనివర్సల్‌ అప్పీల్‌తో రూపొందబోయే ఈ భారీ బడ్జెట్‌ మల్టీ లింగ్వువల్‌ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది. "స్వర్గీయ ఎన్టీఆర్‌గారికి అమితాబ్‌ బచ్చన్‌గారంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్‌ హిట్‌ రీమేక్స్‌లోనూ ఆయన నటించారు. రామకృష్ణ థియేటర్‌లో 'షోలే' మూవీ ప్రదర్శితమవుతున్నప్పుడు నేను, ఎన్టీఆర్‌గారు చాలాసార్లు, ఆ సినిమాను చూశాం. ఇన్నేళ్ల తర్వాత మా వైజయంతీ మూవీస్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న సినిమాలో అమితాబ్‌గారు నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది" అని అశ్వినీదత్‌ అన్నారు. "అమితాబ్‌ బచ్చన్‌గారు మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన పాత్ర సినిమా ఆసాంతం ఉంటుంది. ఆయనైతేనే ఆ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది" అని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అన్నారు. 2022లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. Updated Date - 2020-10-09T16:14:43+05:30 IST