అమితాబ్ త్వ‌రగా కోలుకోవాలంటూ స‌చిన్ ప్రార్థ‌న‌లు

ABN , First Publish Date - 2020-07-12T11:06:31+05:30 IST

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విష‌యాన్ని అమితాబ్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ప్రస్తుతం అమితాబ్....

అమితాబ్ త్వ‌రగా కోలుకోవాలంటూ స‌చిన్ ప్రార్థ‌న‌లు

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విష‌యాన్ని అమితాబ్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్‌...బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో స‌చిన్‌... మీ ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండి అమిత్‌జీ... మీరు మంచి ఆరోగ్యంతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాను. అని పేర్కొన్నారు. సచిన్ మాదిరిగానే క్రికెట‌ర్లు షోయబ్ అక్తర్, యువరాజ్ సింగ్‌లు కూడా అమితాబ్ త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కాగా అమితాబ్‌కు ముందు బాలీవుడ్ ప్ర‌ముఖులు కనికా కపూర్, కిరణ్ కుమార్, కరీం మొరానీ, అతని ఇద్దరు కుమార్తెలు జోవా, షాజా మొరానీ కూడా కోవిడ్ -19 బారిన ప‌డ్డారు. 

Updated Date - 2020-07-12T11:06:31+05:30 IST