దేశం అండ‌తో మీరు త‌ప్ప‌క క‌రోనాను జ‌యిస్తారు: బిగ్ బీ ఆరోగ్యంపై అనుప‌మ్ ట్వీట్‌!

ABN , First Publish Date - 2020-07-12T10:44:46+05:30 IST

బాలీవుడ్ న‌టులు అమితాబ్, అతని కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్‌గా గుర్తించిన నేప‌ధ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. న‌టుడు...

దేశం అండ‌తో మీరు త‌ప్ప‌క క‌రోనాను జ‌యిస్తారు: బిగ్ బీ ఆరోగ్యంపై అనుప‌మ్ ట్వీట్‌!

బాలీవుడ్ న‌టులు అమితాబ్, అతని కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్‌గా గుర్తించిన నేప‌ధ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. న‌టుడు అనుప‌మ్‌ఖేర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అమితాబ్‌ను ఉద్దేశించి... కరోనా యుద్ధంలో మీరు ఖచ్చితంగా గెలుస్తారని నాతో పాటు దేశ‌మంతా నమ్మకంగా ఉందని పేర్కొన్నారు....అమితాబ్ బచ్చన్ జీ... మీరు మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని ఎంతో ధైర్యంతో అధిగమించారు. కరోనా యుద్ధంలో గెలిచి, మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని దేశ‌మంతా నమ్ముతోంది. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మేమంతా ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. కాగా మ‌రికొందరు ప్ర‌ముఖులు కూడా అమితాబ్ త్వ‌రగా కోలుకోవాల‌ని కోరుతూ ట్వీట్ చేశారు. 


అమితాబ్ బ‌చ్చ‌న్ త్వ‌రగా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థిస్తున్నాను - ‌మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్


ప్రియమైన అమితాబ్ జీ, మీరు త్వరగా కోలుకోవాలని, నాతో పాటు దేశం యావ‌త్తూ కోరుకుంటోంది. మీరు ఈ దేశంలోని లక్షలాది మందికి హీరో, ఐకానిక్ సూపర్ స్టార్. మేమంతా మిమ్మల్ని చ‌క్క‌గా చూసుకుంటాం. మీరు త్వరగా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను - కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ 


Updated Date - 2020-07-12T10:44:46+05:30 IST