అమితాబ్ వీడియో ఇప్పటిది కాదు.. అసలు నిజం ఏంటంటే..

ABN , First Publish Date - 2020-07-12T21:46:36+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కరోనా సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనమరాలు ఆరాధ్య కూడా..

అమితాబ్ వీడియో ఇప్పటిది కాదు.. అసలు నిజం ఏంటంటే..

అమితాబ్ వీడియో ఇప్పటిది కాదు..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కరోనా సోకింది. దీంతో.. అమితాబ్ ఫ్యాన్స్ కలవరపాటుకు లోనయ్యారు. ఇదే సమయంలో.. ఏప్రిల్‌లో అమితాబ్ రికార్డ్ చేసిన ఓ వీడియో సందేశం తాజాగా వైరల్‌గా మారింది. అయితే.. అది అమితాబ్ శనివారం నాడు నానావతి హాస్పిటల్‌లో చేరిన తర్వాత రికార్డ్ చేసిన వీడియోగా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి. కానీ.. అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. అది అమితాబ్ ఏప్రిల్‌లో రికార్డ్ చేసిన పాత వీడియోగా తెలిసింది.


వైద్యులు, వైద్య సిబ్బందిని ఉద్దేశించి అమితాబ్ చెప్పిన మాటలతో కూడిన ఓ వీడియోను గత ఏప్రిల్‌ 23న మధ్యాహ్నం 2.21 నిమిషాలకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను.. అమితాబ్ హాస్పిటల్‌లో చేరిన అనంతరం రికార్డ్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. వీడియో ఎప్పటిదైనప్పటికీ సదుద్దేశంతో కూడిన సందేశం కావడం గమనార్హం.





Updated Date - 2020-07-12T21:46:36+05:30 IST