ఆ మహిళను క్షమాపణ కోరిన అమితాబ్.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2020-12-29T07:31:00+05:30 IST

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఓ మహిళకు క్షమాపణ చెప్పాడు. ఇటీవల అమితాబ్ ఓ హిందీ కవితను ట్వీట్ చేశాడు. అయితే అది రాసింది మాత్రం అమితాబ్ కాదు.

ఆ మహిళను క్షమాపణ కోరిన అమితాబ్.. కారణం ఇదే!

ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఓ మహిళకు క్షమాపణ చెప్పాడు. ఇటీవల అమితాబ్ ఓ హిందీ కవితను ట్వీట్ చేశాడు. అయితే అది రాసింది మాత్రం అమితాబ్ కాదు. దీంతో తిషా అగర్వాల్ అనే మహిళ అమితాబ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘సర్.. మీ ట్విట్టర్‌ వాల్‌పై నా కవిత ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. అయితే అక్కడ నా పేరు కూడా ఉండుంటే నా సంతోషం రెట్టింపు అయ్యేది’ అని పేర్కొంది. దీనికి సమాధానం ఇచ్చిన అమితాబ్.. ‘‘ఈ కవితకు సంబంధించిన ట్వీట్ క్రెడిట్ మొత్తం తిషా అగర్వాల్‌దే. ఇది ఎవరు రాసిందీ నాకు తెలియదు. ఎవరో నాకు పంపితే బావుందనే ఉద్దేశ్యంతో ట్వీట్ చేశారు. క్షమించండి’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. అమితావ్ వంటి వ్యక్తి ఇలా క్షమాపణలు కోరడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.Updated Date - 2020-12-29T07:31:00+05:30 IST