సినీ అభిమానులకు ఏఎంబీ సినిమాస్‌ గుడ్‌ న్యూస్‌

ABN , First Publish Date - 2020-12-01T18:22:49+05:30 IST

థియేటర్స్‌ విషయంలోనూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి.

సినీ అభిమానులకు ఏఎంబీ సినిమాస్‌ గుడ్‌ న్యూస్‌

కోవిడ్‌ ప్రభావంతో అన్నీ రంగాలు బాగా నష్టపోయాయి. అలా నష్టాన్ని చవిచూసిన రంగాల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దాదాపు ఆరేడు నెలలు పాటు సినీ కార్మికులే కాదు.. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితుల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడిప్పుడే మన స్టార్స్‌, దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్‌నుస్టార్ట్‌ చేస్తున్నారు. థియేటర్స్‌ విషయంలోనూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని సూచనలు చేస్తూ థియేటర్స్‌ను ఓపెన్‌ చేసుకోవడానికి యాజమాన్యాలకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలోఇది చర్య తీసుకోవడానికి సమయం అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ  ఏఎంబీ సినిమాస్‌ డిసెంబర్‌ 4 నుండి తమ మల్టీప్లెక్స్‌ను తెరవబోతునట్లు తెలియజేసింది. 


Updated Date - 2020-12-01T18:22:49+05:30 IST

Read more