అమ‌ర్‌సింగ్ మృతికి అమితాబ్ సంతాపం... ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్‌!

ABN , First Publish Date - 2020-08-02T10:41:56+05:30 IST

ప్రముఖ రాజ‌కీయ నేత‌, బాలీవుడ్ పరిశ్రమతో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన‌ అమర్ సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూసిన ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు నివాళులు అర్పిస్తున్నారు.

అమ‌ర్‌సింగ్ మృతికి అమితాబ్ సంతాపం... ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్‌!

ప్రముఖ రాజ‌కీయ నేత‌, బాలీవుడ్ పరిశ్రమతో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన‌ అమర్ సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూసిన ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు నివాళులు అర్పిస్తున్నారు. ఒకప్పుడు అమర్ సింగ్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగిన‌ అమితాబ్ బచ్చన్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోకు అమితాబ్ ఎటువంటి క్యాప్ష‌న్ రాయ‌లేదు. అయితే అభిమానులు ఈ ఫొటోను అమితాబ్ త‌న స్నేహితుడు అమర్ సింగ్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ, షేర్ చేసివుంటార‌ని భావిస్తున్నారు. ఈ ఫొటోలో అమితాబ్ తల వంచుకుని క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో క‌రోనాకు చికిత్స పొందుతున్నారు. ఆసుప‌త్రి నుంచే ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా అమితాబ్ తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజ‌న్లు అమితాబ్ సీనియ‌ర్ నేత అమ‌ర్ సింగ్‌కు నివాళులు అర్పిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2020-08-02T10:41:56+05:30 IST