బాహుబ‌లి-2పై అమితాబ్ ఆస‌క్తిక‌ర కామెంట్‌

ABN , First Publish Date - 2020-05-27T17:03:31+05:30 IST

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ న‌టించిన అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రానికి 43 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమితాబ్ ఈ చిత్రానికి సంబంధించిన...

బాహుబ‌లి-2పై అమితాబ్ ఆస‌క్తిక‌ర కామెంట్‌

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ న‌టించిన అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రానికి 43 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అమితాబ్ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు. అలాగే.... 43 సంవత్సరాల క్రితం అమర్ అక్బర్ ఆంథోనీ రూ .7.25 కోట్లు రాబ‌ట్టింది. ఆ మొత్తాన్ని ఇప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం చూస్తే అది బాహుబలి- 2 కంటే క‌లెక్ష‌న్స్ కంటె ఎక్కువ అని రాశారు. కాగా ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతు కపూర్, పర్వీన్ బాబీ, ప్రాణ్, నిరుపమ్‌రాయ్ త‌దిత‌రులు న‌టించారు. ఇంత‌కుముందు కూడా అమితాబ్ ఈ సినిమాకు సంబంధించిన ఒక స‌న్నివేశ‌పు వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు.  

Updated Date - 2020-05-27T17:03:31+05:30 IST