మాజీ ప్రియుడిపై కోర్టుకెళ్లిన అమలాపాల్‌

ABN , First Publish Date - 2020-11-04T02:38:04+05:30 IST

చెన్నై కోర్టులో తన ఫొటోలను తప్పుడు శీర్షికతో ప్రచురించిన భవిందర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని అమలాపాల్ కోరింది.

మాజీ ప్రియుడిపై కోర్టుకెళ్లిన అమలాపాల్‌

డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ నుండి విడిపోయిన తర్వాత అమలాపాల్‌ ముంబైకి చెందిన సింగర్‌ భవిందర్‌ సింగ్‌తో ప్రేమాయణం నెరిపింది. తర్వాత అతనితో కూడా విడిపోయింది. ఈలోపు కోవిడ్‌ ప్రభావం స్టార్ట్‌ కావడంతో అమలాపాల్‌ ఇంటికే పరిమితమైంది. అయితే కొన్ని రోజుల క్రితం భవిందర్‌ సింగ్‌, అమలాపాల్‌ పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. తర్వాత అలాంటిదేమీ లేదని అమలాపాల్‌ వివరణ ఇచ్చుకుంది. అయితే ఓ ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలను తన మాజీ ప్రియుడు భవిందర్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై అమలాపాల్‌ సీరియస్‌ అయ్యింది. చెన్నై కోర్టులో తన ఫొటోలను తప్పుడు శీర్షికతో ప్రచురించిన భవిందర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని అమలాపాల్ కోరింది. కేసు వివరాలు విన్న జడ్జ్‌ భవిందర్‌ సింగ్‌పై కేసు వేయడానికి అనుమతినిచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్లనుందో చూడాలి. 


Updated Date - 2020-11-04T02:38:04+05:30 IST

Read more