తెలుగు వెబ్‌సిరీస్‌ల్లో...

ABN , First Publish Date - 2020-12-24T06:13:51+05:30 IST

దక్షిణాది కథానాయిక అమలాపాల్‌ డిజిటల్‌ మీడియా అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఆమె ఒకేసారి రెండు వెబ్‌సిరీస్‌లు ...

తెలుగు వెబ్‌సిరీస్‌ల్లో...

దక్షిణాది కథానాయిక అమలాపాల్‌ డిజిటల్‌ మీడియా అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఆమె ఒకేసారి రెండు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘లస్ట్‌స్టోరీస్‌’ తెలుగు రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఆమె ఆహా ఓటీటీ వేదిక కోసం ‘కుడి ఎడమైతే’ అనే మరో తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ‘యు టర్న్‌’ ఫేం పవన్‌ కుమార్‌ ఈ సైన్స్‌ఫిక్షన్‌ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. 8 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో అమలాపాల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. తమిళ నటుడు విజయ్‌ సరసన చేసిన ‘తలైవా’ తర్వాత ఆమె మరోసారి ఈ వెబ్‌సిరీస్‌లో పోలీస్‌ పాత్రను పోషిస్తున్నారు.

Updated Date - 2020-12-24T06:13:51+05:30 IST