అమల హాట్ అవతార్!

ABN , First Publish Date - 2020-06-08T22:12:11+05:30 IST

హీరోయిన్ అమలాపాల్ తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ గుర్తింపు మాత్రం భారీగానే లభించింది.

అమల హాట్ అవతార్!

హీరోయిన్ అమలాపాల్ తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ గుర్తింపు మాత్రం భారీగానే లభించింది. `నాయక్`, `ఇద్దరమ్మాయిలతో`, `రఘువరన్ బీటెక్` వంటి సినిమాలు తెలుగులో అమలకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అమల కెరీర్ మరింత జోరందుకుంది. 


తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. హిందీలో మహేష్ భట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ హాట్ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా అమల `షి ఇండియా` అనే లైఫ్‌స్టైల్ మేగజీన్ కవర్ పేజీపై మెరిసింది. ఆ మేగజీన్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా అమల కవర్ పేజీతో వార్షికోత్సవ ఎడిషన్ బయటకు వచ్చింది. ఆ కవర్ పేజీపై అమల హాట్ హాట్‌గా కనిపించింది. ఈ కవర్‌పేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2020-06-08T22:12:11+05:30 IST