అమల బికినీ వేదాంతం!

ABN , First Publish Date - 2020-06-16T17:12:38+05:30 IST

జీవితం ఉన్నది జీవించడానికేనని, యుద్ధం చేయడానికి కాదని అంటోంది హీరోయిన్ అమలాపాల్.

అమల బికినీ వేదాంతం!

జీవితం ఉన్నది జీవించడానికేనని, యుద్ధం చేయడానికి కాదని అంటోంది హీరోయిన్ అమలాపాల్. సినిమాలతో కంటే తన వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో ఉంటూ వస్తోంది హీరోయిన్ అమలాపాల్. ప్రస్తుత లాక్‌డౌన్ విరామ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్న అమల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.


బికినీ ధరించి తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దాని కింద ఆమె చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. `కొంత మంది వ్యక్తులు ప్రశాంతత కోసం ప్రయత్నిస్తూ తమ జీవితంలోని విలువైన సంవత్సరాలను యుద్ధంతో గడిపేస్తారు. మీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించరెందుకు. ప్రశాంతంగా జీవించడమే అన్నింటి కంటే ముఖ్యమ`ని అమల కామెంట్ చేసింది. 

Updated Date - 2020-06-16T17:12:38+05:30 IST