సంక్రాంతి బరిలో.. ‘అల్లుడు అదుర్స్’

ABN , First Publish Date - 2020-12-27T23:02:35+05:30 IST

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 50శాతం ఆక్యూపెన్సీతో సినిమా థియేటర్లు రన్ అవుతున్న విషయం తెలిసిందే

సంక్రాంతి బరిలో.. ‘అల్లుడు అదుర్స్’

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 50శాతం ఆక్యూపెన్సీతో సినిమా థియేటర్లు రన్ అవుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 25న సాయితేజ్‌ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసిన హీరోలు.. ఇప్పుడు రెడీ అయిన తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే అందరూ సంక్రాంతిని టార్గెట్‌ చేస్తూ.. రిలీజ్‌ డేట్స్‌ ప్రకటిస్తున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌ చేయబోతోన్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. 


సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగింపు ద‌శ‌లో ఉంది. పండ‌గ సీజ‌న్ల‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' చిత్రం వారికి స‌రైన చాయిస్ అని చిత్ర బృందం తెలుపుతోంది. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ స‌ర‌స‌న న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్, వెన్నెల కిశోర్‌, స‌త్యా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


Updated Date - 2020-12-27T23:02:35+05:30 IST