అల్లు హీరో జీవితం తలకిందులు!

ABN , First Publish Date - 2020-05-11T21:57:59+05:30 IST

బిజీ బిజీ జీవితానికి కరోనా మహమ్మారి బ్రేకులేసింది. ఎప్పుడూ తీరిక లేకుండా తిరిగే వారిని ఇంటికే పరిమితం చేసింది.

అల్లు హీరో జీవితం తలకిందులు!

బిజీ బిజీ జీవితానికి కరోనా మహమ్మారి బ్రేకులేసింది. ఎప్పుడూ తీరిక లేకుండా తిరిగే వారిని ఇంటికే పరిమితం చేసింది. సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. జిమ్‌లు, వర్కవుట్లు లేకపోవడంతో ఇంట్లోనే యోగా వంటి వ్యాయామాలు చేస్తున్నారు. 


అల్లు హీరో శిరీష్ కూడా యోగా బాట పట్టాడు. చక్రాసనం వేసిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. `జీవితం తలకిందులైపోయింది. కాబట్టి నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. బిజీ బిజీ జీవితంలో యోగాకు దూరమయ్యాను. కానీ, లాక్‌డౌన్ నన్ను మళ్లీ యోగా వైపు మళ్లించింది. పరికరాలు అక్కర్లేదు. ఎక్కడైనా చేయవచ్చు` అంటూ శిరీష్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-11T21:57:59+05:30 IST