లాక్‌డౌన్ ఎఫెక్ట్: బన్నీ తనయుడు ఏం చేశాడో తెలుసా?

ABN , First Publish Date - 2020-05-14T16:58:37+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి పిల్లలు అల్లు అయాన్, అర్హ చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు

లాక్‌డౌన్ ఎఫెక్ట్: బన్నీ తనయుడు ఏం చేశాడో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి పిల్లలు అల్లు అయాన్, అర్హ చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. వీరిక సంబంధించిన విశేషాలను బన్నీ, స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల అర్హ.. `బుట్టబొమ్మ` పాట పాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 


తాజాగా బన్నీ తనయుడు అయాన్ చెఫ్ అవతారమెత్తి సలాడ్ తయారు చేశాడు. ఈ వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. సలాడ్ తయారు చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో అయాన్ వివరించాడు. ఎన్నో విటమిన్లను కలిగి ఉండే సలాడ్ శరీరాన్ని బలంగా తయారు చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా‌ మారింది.
Updated Date - 2020-05-14T16:58:37+05:30 IST