‘మా వింత గాధ వినుమా’ ఫస్ట్ లుక్ విడుదల
ABN , First Publish Date - 2020-10-25T01:52:57+05:30 IST
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ‘మా వింత గాధ వినుమా’. ఈ చిత్ర ఫస్ట్

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ‘మా వింత గాధ వినుమా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఆదిత్య మండల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం ఆహా ఓటీటీలో విడుదలకానుంది.
చిత్ర ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఓటీటీ యాప్‌గా ఆహా ప్రతి నెల క్రమంగా ప్రేక్షకులకు చాలా దగ్గరవుతుంది. అందులో భాగంగా నవంబర్ 13న ఆహాలో ‘మా వింత గాధ వినుమా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఇది సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ. మంచి ఫన్ ఉంటుంది. అలాగే ఆలోచనను రేకెత్తిస్తుంది. తెలుగు ప్రేక్షకుల అభిమాన తారలు నటించిన చిత్రాలతో పాటు క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ఆహా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. వారికి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే దిశగా మేం ఇంకా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ‘భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్, ఒరేయ్ బుజ్జిగా, కలర్‌ఫొటో’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ శుక్రవారం విడుదలైన ‘కలర్‌ఫొటో’ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై ఇరవై నాలుగు గంటలైనప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతుండటమే అందుకు నిదర్శనం. ముందు ముందు ఇంకా మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తాము..’’ అని తెలిపారు.

Read more