నాకు అక్కడ ఇల్లు లేదు: అల్లు అర్జున్

ABN , First Publish Date - 2020-02-14T22:29:25+05:30 IST

`అల వైకుంఠపురములో..` సినిమా ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న స్టైలిష్‌స్టార్

నాకు అక్కడ ఇల్లు లేదు: అల్లు అర్జున్

`అల వైకుంఠపురములో..` సినిమా ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. బన్నీ తర్వాతి సినిమాకు సుకుమార్ దర్శకుడనే సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. 


బాలీవుడ్‌ సినిమా చేయాలని ఉందని చెప్పిన బన్నీ.. ముంబైలోని ఇంటి గురించి మాట్లాడాడు. `ముంబైలో ఉన్న అపార్ట్‌మెంట్ నాది కాదు. అది గీతా ఆర్ట్స్ సంస్థ గెస్ట్ హౌస్. నాకు ముంబై అంటే చాలా ఇష్టం. తరచుగా ఇక్కడికి వస్తుంటా. అలా వచ్చినపుడు ఆ గెస్ట్ హౌస్‌లో దిగుతాను. త్వరలోనే నేను కూడా ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటున్నాన`ని బన్నీ చెప్పాడు. 

Updated Date - 2020-02-14T22:29:25+05:30 IST