బన్నీ, స్నేహ వాకింగ్ ఫొటోస్ వైరల్!

ABN , First Publish Date - 2020-07-03T17:31:15+05:30 IST

కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలూ ప్రభావితమయ్యాయి.

బన్నీ, స్నేహ వాకింగ్ ఫొటోస్ వైరల్!

కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలూ ప్రభావితమయ్యాయి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమ్యారు. వర్కవుట్లు చేయడానికి జిమ్‌లు, వాకింగ్ చేయడానికి పార్కులు కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు తమ ఇళ్లకు సమీపంలోని రోడ్లపై వాకింగ్ చేస్తున్నారు. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అతని భార్య స్నేహ వాకింగ్ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేబీఆర్ పార్క్ మూసి వేయడంతో వీరిద్దరూ దాని వెలుపల వాకింగ్ చేస్తున్నారు. జన సందోహం తక్కువగా ఉంటుందనే కారణంతో తెల్లవారుజామునే వీరిద్దరూ వాకింగ్ పూర్తి చేసుకుంటున్నారు. 


Updated Date - 2020-07-03T17:31:15+05:30 IST