చిన్నారి అభిమానికి బన్నీ సర్‌ప్రైజ్
ABN , First Publish Date - 2020-12-25T21:31:36+05:30 IST
నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓ చిన్నారి అభిమాని కోరికను నేరవేర్చి సర్ ప్రైజ్ ఇచ్చారు.

నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓ చిన్నారి అభిమాని కోరికను నేరవేర్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో అల్లు అర్జున్ అభిమాని అయిన ఓ పిల్లాడున్నాడు. తనకు బన్నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరిక. విషయాన్ని తెలుసుకున్న బన్నీ చిన్నారి అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనయుడు అల్లు అయాన్ ద్వారా సదరు చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్‌ను పంపడమే కాకుండా.. అక్కడున్న మిగతా పిల్లలందరికీ కూడా బహుమతులను పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ చిన్నారి అభిమాని బన్నీ నుండి వచ్చిన ఈ సర్ ప్రైజ్ చూసి ఎంతో సంతోషించాడు.