ఈ తరహా కథతో మొదటిసారి అల్లు అర్జున్‌

ABN , First Publish Date - 2020-11-13T11:00:17+05:30 IST

‘‘సుకుమార్‌ రాసిన ‘పుష్ప’ కథ నాకు బాగా నచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంగా యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న పాయింట్‌తో తెరకెక్కుతోన్న...

ఈ తరహా కథతో మొదటిసారి అల్లు అర్జున్‌

‘‘సుకుమార్‌ రాసిన ‘పుష్ప’ కథ నాకు బాగా నచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంగా యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. కరోనా క్రైసిస్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నాం’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అడవుల్లో హీరోతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘అన్ని భాషల్లో ఉన్న అల్లు అర్జున్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చేలా ఈ కథ రెడీ చేశా’’ అని అన్నారు. ‘‘యూనివర్సల్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. కరోనా నిబంధనలు అనుసరించి షూటింగ్‌ మొదలుపెట్టాం. కొత్తగా కథలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి మా సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో ‘పుష్ప’ విజయం సాధిస్తుందని చెప్పగలం’’ అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2020-11-13T11:00:17+05:30 IST