బన్నీకి ఆ సినిమా చాలా నచ్చిందట!

ABN , First Publish Date - 2020-05-25T17:00:42+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో భారీ విజయం అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి సారించాడు

బన్నీకి ఆ సినిమా చాలా నచ్చిందట!

ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో భారీ విజయం అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి సారించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తను నటిస్తున్న `పుష్ప` సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నాడు. 


ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు. `నేను తరచుగా బాలీవుడ్ సినిమాలు చూస్తుంటాను. బాలీవుడ్ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చిన సినిమా `జో జీతా వహీ సికిందర్`. ఈ సినిమాను ఇప్పటివరకు 20సార్లు చూసుంటాను. అలాగే షారూక్, కాజోల్ నటించిన `దిల్‌వాలే దుల్హనియే లేజాయేంగే` సినిమా కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇక, ఇటీవలి కాలంలో `గల్లీబాయ్` సినిమా బాగా నచ్చింద`ని బన్నీ చెప్పాడు. 

Updated Date - 2020-05-25T17:00:42+05:30 IST

Read more