సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

`వేదం` సినిమాను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్!

ABN, First Publish Date - 2020-06-04T18:08:49+05:30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క, మంచు హీరో మనోజ్ ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్ క్రిష్ రూపొందించిన చిత్రం `వేదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క, మంచు హీరో మనోజ్ ప్రధాన పాత్రధారులుగా డైరెక్టర్ క్రిష్ రూపొందించిన చిత్రం `వేదం`. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే ఈ సినిమాలో బన్నీ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా బన్నీ గుర్తు చేసుకున్నాడు. 


`వేదం` సినిమా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ``వేదం` సినిమాకు పదేళ్లు. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణుడికి ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించిన  దర్శకుడు క్రిష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సినిమాలో నటించిన మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌పేయి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు` అన్ని బన్నీ ట్వీట్ చేశాడు. 




Updated Date - 2020-06-04T18:08:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!