5 సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన అల్లు అర్జున్
ABN , First Publish Date - 2020-11-14T05:00:46+05:30 IST
డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ఓటీటీ మాధ్యమంగా దూసుకుపోతున్న ‘ఆహా’ఓటీటీ యాప్ గ్రాండ్ రిలీజ్ వేడుకను శుక్రవారం నిర్వహించారు.‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా

డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ఓటీటీ మాధ్యమంగా దూసుకుపోతున్న ‘ఆహా’ఓటీటీ యాప్ గ్రాండ్ రిలీజ్ వేడుకను శుక్రవారం నిర్వహించారు.‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా.. 5 సర్‌ప్రైజ్‌లను కూడా ఇచ్చారు. ఈ వేదికపై ఫస్ట్ సర్‌ప్రైజ్‌గా ఈ ఓటీటీ ప్రమోషన్ కోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఓ యాడ్‌ని విడుదల చేసిన బన్నీ.. మిగతా 4 సర్‌ప్రైజ్‌లుగా ఈ ఓటీటీలో అగ్ర దర్శకులు షోస్ చేయబోతున్నట్లుగా చెబుతూ.. వారి పేర్లను కూడా రివీల్ చేశారు.
ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నెంబర్ వన్ తెలుగు ఫ్లాట్‌ఫాంగా ఆహాని మార్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆహాకు ఏదైనా చేయాలనిపించింది. అప్పుడే అల వైకుంఠపురములో సినిమా పూర్తయ్యింది. మీరు, త్రివిక్రమ్ కలిసి ఏదైనా చేయొచ్చు కదా.. అని అడిగినప్పుడు నేను, త్రివిక్రమ్‌గారు కలిసి ఓ యాడ్ చేశాం. అంతే కాకుండా నాతో కలిసి పనిచేసిన నలుగురు దర్శకులు ఆహాలో షోస్ చేస్తున్నారు. సుకుమార్‌గారు(ఆర్య, ఆర్య2, పుష్ఫ) ఓ అద్భుతమైన షో చేయబోతున్నారు. అలాగే హరీశ్ శంకర్ (దువ్వాడ జగన్నాధం) కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. సురేందర్ రెడ్డిగారు (రేసుగుర్రం) కూడా ఓ షో చేస్తున్నారు. వంశీ పైడిపల్లిగారు(ఎవడు) కూడా ఆహా కోసం ఓ షో చేస్తున్నారు. వీరుచేయబోయే షోస్ గురించి అప్‌డేట్స్ త్వరలో ఇస్తాం'' అని తెలిపారు.
Read more