అఫీషియల్... అల్లు అర్జున్ 21 కొరటాలతోనే

ABN , First Publish Date - 2020-07-31T18:43:52+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌బోతున్న 21వ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను మెసేజ్ జోడించి చెప్ప‌గ‌ల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

అఫీషియల్... అల్లు అర్జున్ 21 కొరటాలతోనే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌బోతున్న 21వ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను మెసేజ్ జోడించి చెప్ప‌గ‌ల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. యువ సుధ ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. శాండీ, స్వాతి, న‌ట్టి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. 2021లో ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2022 ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ త‌న 20వ సినిమా ‘పుష్ప‌’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ త‌న 21వ సినిమాను ప్రారంభిస్తారు. 

Updated Date - 2020-07-31T18:43:52+05:30 IST