ఆ పెయింటింగులన్నీ నేనే వేస్తా!

ABN , First Publish Date - 2020-04-16T10:00:23+05:30 IST

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ వచ్చి పడడంతో, తమకు లభించిన ఖాళీ సమయాన్ని కథానాయికలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. తమలో సృజనాత్మకతను వెలుగులోకి తీస్తున్నారు..

ఆ పెయింటింగులన్నీ నేనే వేస్తా!

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ వచ్చి పడడంతో, తమకు లభించిన ఖాళీ సమయాన్ని కథానాయికలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. తమలో సృజనాత్మకతను వెలుగులోకి తీస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరోయిన్‌ నభా నటేశ్‌ పెయింటింగులు వేయడం ప్రారంభించారు. స్వతహాగా ఆర్టిస్ట్‌ అయిన ఆమె, ఇప్పుడు తనలో పెయింటింగ్‌ స్కిల్స్‌కు మరింత పదును పెడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని సొంతింటిలో ఉన్న నభా నటేశ్‌ మాట్లాడుతూ ‘‘నా అదృష్టం ఏంటంటే... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదల తర్వాత చిన్న బ్రేక్‌ దొరికినప్పుడు ఇంటికి వచ్చా. అప్పుడు పెయింటింగ్స్‌ వేయడానికి అవసరమైనవి చాలా వరకూ ఆర్డర్‌ చేశా. ఇప్పుడు అవన్నీ బయటకు తీశా. నేను అప్పుడే డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఫ్రేములు డజను ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నా. నాకిష్టమైన ఫొటోలను ప్రింట్‌ అవుట్‌ తీసుకుని ఆ ఫ్రేముల్లో అందంగా అలంకరిద్దామనుకున్నా. ఇప్పుడు టైమ్‌ దొరకడంతో అవన్నీ నేనే పెయింటింగ్స్‌ వేసి నా గదిలో గోడపై అలంకరించాలనుకుంటున్నా’’ అన్నారు.


Updated Date - 2020-04-16T10:00:23+05:30 IST

Read more