ఆలియాకు ఇష్టమైన దక్షిణాది హీరో ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-02T17:37:45+05:30 IST

ఆలియా భట్.. బాలీవుడ్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఆలియాకు ఇష్టమైన దక్షిణాది హీరో ఎవరో తెలుసా?

ఆలియా భట్.. బాలీవుడ్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సామాన్యులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా అభిమానులుగా మార్చుకుంది. మరి, ఎంతో మంది అభిమానించే ఆలియాకు ఇష్టమైన దక్షిణాది హీరో ఎవరు..?


తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆలియా తనకిష్టమైన హీరో గురించి మాట్లాడింది. `నాకు దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అంటే చాలా ఇష్టం. `బాహుబలి`లో ప్రభాస్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆ సినిమా చూసి ప్రభాస్‌కు అభిమానిగా మారిపోయా. అవకాశం వస్తే ప్రభాస్‌తో నటించాలని ఉంద`ని ఆలియా తెలిపింది. ఆలియా ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోంది. 

Updated Date - 2020-04-02T17:37:45+05:30 IST