మహేష్ కూతురికి ఆలియా గిఫ్ట్!

ABN , First Publish Date - 2020-12-08T22:28:51+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది.

మహేష్ కూతురికి ఆలియా గిఫ్ట్!

సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తూ సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉంది. సితారకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసే నమ్రత తాజాగా మరో ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 


సింపుల్ మిడ్డీ డ్రెస్ ధరించి క్యూట్ ఫోజు ఇచ్చిన సితార ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ డ్రెస్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. సితారకు గిఫ్ట్‌గా ఇచ్చిందట. ఈ నేపథ్యంలో ఆలియాకు నమ్రత ధన్యవాదాలు తెలిపారు. `ఆర్ఆర్ఆర్` షూటింగ్ కోసం ఆలియా తాజాగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. Updated Date - 2020-12-08T22:28:51+05:30 IST