జయప్రకాశ్ రెడ్డి అడిగింది చేయలేకపోయాను: అలీ

ABN , First Publish Date - 2020-09-08T21:07:41+05:30 IST

దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో జయప్రకాశ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

జయప్రకాశ్ రెడ్డి అడిగింది చేయలేకపోయాను: అలీ

దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో జయప్రకాశ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు నివాళులర్పించారు. 


ప్రముఖ కమెడియన్ అలీ కూడా జయప్రకాశ్ రెడ్డికి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. `ఈ రోజు ఉదయం నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణించిన విషయం తెలిసి బాధపడ్డాను. ఆయన ఓ గొప్ప స్టేజ్ యాక్టర్. నాటక రంగాన్ని కాపాడాలనే తపన ఆయనకు ఎక్కువగా ఉండేది. ఆయన సినిమా కంటే ఎక్కువ నాటకాన్నే ప్రేమించారు. ఏ ప్రాంతానికి సంబంధించిన క్యారెక్టర్ చేస్తే ఆ యాసలో మాట్లాడేవారు. భాష మీద, యాస మీద పట్టున్న గొప్ప నటుడు. రాయలసీమ యాసకు గొప్ప పేరు తీసుకొచ్చింది జయప్రకాశ్ రెడ్డిగారే. 30 సంవత్సరాల నుంచి మేం ఇండస్ట్రీలో కలిసి ప్రయాణం చేస్తున్నాం. నాటకరంగం గురించి మాట్లాడేందుకు సీఎం జగన్‌గారిని కలవాలనుకున్నారు. ఆ విషయంలో సహాయం చేయమని నన్ను అడిగారు. కొన్ని కారణాల వల్ల అది ఇప్పటివరకు కుదరలేదు. ఈ లోపే ఆయన మరణించార`ని అలీ పేర్కొన్నారు. 
Updated Date - 2020-09-08T21:07:41+05:30 IST