కార్డ్ లేని జూనియర్ ఆర్టిస్ట్స్‌కి హీరోయిన్ అలేఖ్య ఏంజెల్ సాయం

ABN , First Publish Date - 2020-04-28T00:17:47+05:30 IST

కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో

కార్డ్ లేని జూనియర్ ఆర్టిస్ట్స్‌కి హీరోయిన్ అలేఖ్య ఏంజెల్ సాయం

కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో భాగంగా కథానాయిక అలేఖ్య ఏంజెల్ తన కుటుంబ సభ్యులతో కలిసి హ్యుమానిటీ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలేఖ్య ఏంజెల్ తన ఫ్యామిలీతో కలిసి గత కొన్ని రోజులుగా నిత్యావసర సరుకులు కొంతమంది సామాన్య ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. సోమవారం రోజు సినిమా ఇండస్ట్రీలోని జూనియర్ ఆర్టిస్ట్స్‌కు (కార్డ్ లేని వారికి) 5 లక్షలు తన సొంత డబ్బు ఖర్చు చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 



ఈ సందర్భంగా కథానాయిక అలేఖ్య ఏంజెల్ మాట్లాడుతూ.. ‘‘యూనియన్ కార్డ్ లేకుండా ఉన్న ఆర్టిస్ట్స్ ఈ కష్టకాలంలో పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో చూసి ఈ సహాయం చేశాను. అలాగే కొంతమంది పిల్లలున్న మహిళలకు నగదు రూపంలో సహాయం చేశాను. కష్ట కాలంలో ఇలా కొంతమందికి సహాయం చేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ముందుకు వచ్చి ఆర్టిస్ట్స్‌కు సపోర్ట్‌గా నిలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-04-28T00:17:47+05:30 IST