‘అల వైకుంఠపురములో’ మరో రికార్డ్

ABN , First Publish Date - 2020-08-08T17:09:24+05:30 IST

తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆడియో ఆల్బ‌మ్ మ‌రో రికార్డ్‌ను ద‌క్కించుకుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంతోషంగా ఉన్నారు.

‘అల వైకుంఠపురములో’ మరో రికార్డ్

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ నాన్ బాహుబ‌లి రికార్డ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే త‌మ‌న్ అందించిన పాట‌లు సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యాయి. ఆడియో సాంగ్సే కాదు.. వీడియో సాంగ్స్ కూడా మిలియ‌న్స్ ప్లేస్‌ను ద‌క్కించుకుని తెలుగు సినిమా పాట‌ల్లో కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియో ఆల్బ‌మ్ మ‌రో రికార్డ్‌ను ద‌క్కించుకుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంతోషంగా ఉన్నారు. మొత్తం మ్యూజిక్ ఆల్బ‌మ్ రెండు వంద‌ల మిలియ‌న్ ప్లేస్‌ను ద‌క్కించుకుందని త‌మ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. Updated Date - 2020-08-08T17:09:24+05:30 IST

Read more